పోలవరం జిల్లా ఏకలవ్య పాఠశాలల్లో బ్యాక్ లాక్ సీట్లు భర్తీకి అప్లై చేసుకోవాలని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య సోమవారం తెలిపారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, వై. రామవరం, చింతూరు, మారేడుమిల్లి పాఠశాలల్లో 7, 8, 9వ తరగతుల్లో 24 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. పేరెంట్స్ ఆదాయం ఏడాదికి రూ.లక్షలోపు ఉన్న గిరిజన బాల బాలికలు అర్హులన్నారు.