SKLM: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పలు ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దూప దీప నైవేద్యం పథకం సంబందించి విషయం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.