KDP: కమలాపురం నుండి సోమవారం వడ్ల లోడుతో బంగారుపేటకు వెళుతున్న లారీ వీరపునాయునిపల్లె వెలుగు ఆఫీస్ వద్దకు చేరుకోగానే మంటలు వ్యాపించాయి. లారీ నుండి ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే వేంపల్లి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే లారీ ఎక్కువ భాగం కాలిపోయింది.