ATP: రాయదుర్గం పట్టణంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసనలు తెలిపారు. స్థానిక వినాయక కూడలి వద్ద పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే రద్దు చేయాలని, చిన్న వ్యాపారాలను బతికించాలంటూ నినాదాలు చేపట్టారు. యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పేలా చూడాలని వారు నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.