అన్నమయ్య: కురబలకోట మండలంలోని ముదివేడు క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తంబళ్లపల్లెకు చెందిన మేస్త్రి రామానుజులు (48) తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లెలో పనులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.