NLR: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని ఫ్యాప్టో నాయకులు తిరుపతయ్య, శ్రీనివాసులు, కలివేల రవిచంద్ర అన్నారు. సీతారామపురం ఎంఈవో కార్యాలయం వద్ద ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీతారామపురం ఎంఈవో కార్యాలయం సిబ్బందికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప మరే ఇతర పనులు అప్పగించరాదని కోరారు.