కోనసీమ: సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలికిపురం ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 27,28,29 తేదీలలో మొంథా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మండలంలో చింతలమోరి, శంకరగుప్తం, తూర్పు పాలెం బీచ్లలోకి స్నానానికి ఎవరు వెళ్ళరాదని హెచ్చరించారు.