SKLM: నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. శనివారం సాయంత్రం టెక్కలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి ప్రజల వారి సమస్యలను దరఖాస్తు రూపంలో మంత్రికి అందజేశారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.