W.G: పోడూరు మండలం తూర్పుపాలెంలో జరిగిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం మారాక వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని తెలిపారు.