కృష్ణా: ప్రకాశం బ్యారేజ్ దిగవ నుండి వరద వస్తున్న కారణంగా ప్రజలు సురక్షితంగా ఉండాలని పమిడిముక్కల సీఐ చిట్టిబాబు తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాకాలంలో వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలన్నారు. గత రెండు రోజులుగా కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ స్పష్టం చేశారు.