AKP: జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15,000 ఆదా అవుతుందని అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు అన్నారు. సోమవారం కసింకోట మండలం తాళ్లపాలెం, తీడ, నరసింగబిల్లి గ్రామాల్లో జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కల్పించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో ఉపశమనం లభించిందన్నారు.