విశాఖ: ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే రోడ్డుపై లోడ్ లారీ బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. లారీలోని సరుకు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.