WG: కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా తణుకు పట్టణానికి చెందిన గురుజుకోట రాకేష్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకులు శనివారం తణుకు విచ్చేసి నియామక పత్రాలు అందజేశారు. కుమ్మర శాలివాహన సంక్షేమం అభివృద్ధి కోసం కృషిచేసి, సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని రాకేష్ బాబు తెలిపారు.