VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్దానిక మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారంలోగా రైతులకు సంపూర్ణంగా యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. యూరియా కొరత ఉండడం వాస్తవమే అయినప్పటికీ కొంతమంది పూర్తిగా యూరియా దొరికే పరిస్థితి లేదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని రైతులకు సూచించారు. అవసరానికి సరిపడా యూరియా అందిస్తామన్నారు.