AKP: మండల కేంద్రమైన కోటవురట్లలో ముమ్మరంగా శానిటేషన్ పనులు చేపట్టారు. వీటిని ఎంపీడీవో చంద్రశేఖర్, స్థానిక పంచాయతీ కార్యదర్శి రఘురాం శుక్రవారం పర్యవేక్షించారు. మురికి కాలువలను శుభ్రం చేయించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. మంచినీటి ట్యాంకులను తరచు క్లీన్ చేసి క్లోరినేషన్ చేయించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని MPDO హెచ్చరించారు.