KDP: ఖాజీపేటలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ ఎం.వి. రమణారెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రతి షాప్ను సందర్శించి, ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.