E.G: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకటరావు మంగళవారం రాత్రి తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం వైసీపీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తుంనందున ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు.