NLR: సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణపై శుక్రవారం రాత్రి సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని వారితో సంతకాలు చేయించారు. అనంతరం వాహనదారులచే ప్రమాణం చేయించారు. ద్విచక్ర వాహదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు.