CTR: నగరి YCP కార్యాలయంలో 28న సాయంత్రం 4:00 గంటలకు బూత్ కమిటీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నగరి మాజీ మంత్రి రోజా నాయకత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, నగరి నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యులు, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.