కోనసీమ: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి మెరుగైన ఆరోగ్య వసతుల కల్పన కొసం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ. 40 లక్షల వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 108 అంబు లెన్స్ ను సోమవారం మంత్రి సుభాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.