SKLM: పోలాకి మండలం దీర్ఘాసి లో నిర్మించిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం జరిగిన ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా నరసన్నపేట వైసిపి ఇన్చార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత ఆలయం చెంతనే ఆంజనేయ స్వామి ఆలయం ఏర్పాటు ఆనందదాయకమన్నారు.