ప్రకాశం:పెదచెర్లపల్లి మండల పరిషత్ సమావేశం గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో కృష్ణారావు తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులకు సమావేశంలో చర్చించే ఎజెండాపై ఇప్పటికే సర్కులర్ జారీ చేశామని ఎంపీడీవో తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు విధిగా సమావేశానికి హాజరై తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.