ఏలూరు: ఆర్టీవో కార్యాలయంలో బ్రోకర్ల వ్యవస్థను సహించబోమని ఇంఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కైకలూరులో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు బ్రోకర్లను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.