NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖాదరవల్లి మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో జగదేవిపేట పిహెచ్సి సంబంధిత డాక్టర్లు వైద్య సిబ్బంది మంచిగా సేవలందించారన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేయాలన్నారు.