తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించారు.
తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలన అదనపు ఎస్పిలు వెంకటరావు, విమల కుమారి మాట్లాడుతూ..ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం సైబర్ క్రైమ్(cyber crime) రూపంలోనే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయన్నారు. చాలా మంది మహిళలను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారన్నారు. ఏపీలో లక్షకు పైగా సైబర్ మోసాలు(cyber crime) జరుగుతున్నాయని, సైబర్ మోసాల వల్ల చాలా మంది మానసికంగా వేదనను అనుభవిస్తున్నారన్నారు.
తిరుపతి జిల్లా ప్రజలే కాకుండా తిరుపతికి వచ్చే భక్తులు కూడా ”మొబైట్ హంట్” అప్లికేషన్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మొబైల్ పోయిన వారు 9490617873 అనే నెంబర్‌కు వాట్సాప్ ద్వారా Hai అని మెసేజ్ చేస్తే వారికి ఒక గూగుల్ అప్లికేషన్ ఫామ్ వస్తుందని, అందులో తగిన వివరాలను నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. తిరుపతి సైబర్ పోలీసులు ఆ ఫిర్యాదులను స్వీకరించి పోయిన మొబైల్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేస్తారన్నారు. E-KYC, ఆధార్ అప్డేట్, బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని చెప్పి కాల్ చేసే అపరిచితులకు దయచేసి OTPని చెప్పకూడదని సూచించారు.
బ్యాంకు సిబ్బంది ఎప్పుడు కూడా అటువంటి కాల్స్, మెసేజెస్ చేయరని తెలిపారు. సైబర్ క్రైమ్(cyber crime) బాధితులకు సత్వరమే న్యాయం చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకు అధికారులను, టెలికాం ఆపరేటర్ అధికారులను ఆహ్వానించి వారిని కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాంటప్పుడే అందరూ సైబర్ నేరాలను నివారించగలరని తెలిపారు.
సైబర్ నేరం(cyber crime) జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా స్వయంగా సైబర్ క్రైమ్(cyber crime) ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తారన్నారు. నరసింహ రావు మాట్లాడుతూ.. నేటి తరం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సైబర్ నేరాల(cyber crime)పై అందరికీ అవగాహన అవసరం అని అన్నారు. అవగాహన లేకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా చాలా మంది నేరగాళ్లు పుట్టుకొస్తున్నారన్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు(cyber crime) జరుగుతున్న తీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 500ల పైచిలుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈజీ మణీ కోసం అలవాడు పడే కొంతమంది ఈ సైబర్ నేరాలు చేస్తున్నట్లు తెలిపారు.