మీ అకౌంట్ నుంచి ఆకస్మాత్తుగా నగదు మాయామైందా..లేదా గిఫ్ట్ అంటూ క్యాష్ దోచేశారా..అర్డర్ వచ్చిందంటూ ఎవరైనా మనీ కాజేశారా..అయితే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయండి. అప్రమత్తమై ఈ నెంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం వల్ల.. మీ నగదును కాపాడుకోవచ్చు. అంతేకాదు ఆ నేరగాళ్లను పట్టుకునే అవకాశం కూడా ఉంది.
రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు. 24 గంటలపాటు పనిచేయనున్న ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు ఎక్కడి నుంచైనా ఫోన్ చేయొచ్చు. అంతేకాదు www.cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదులను పంపవచ్చని అదికారులు వెల్లడించారు.