»Crowd Of Devotees In Tirumala Srikalahasti Crowded With Devotees
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ..భక్తజనంతో కిక్కిరిసిన శ్రీకాళహస్తి
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శనివారం మహాశివరాత్రి(Maha Shivaratri), ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పులకించింది.
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శనివారం మహాశివరాత్రి(Maha Shivaratri), ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పులకించింది. కలియుగ వైకుంఠ దైవం తిరుమలేశుడి సన్నిధిలో భక్తుల రద్దీ(Crowd of devotees) అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో కాంపార్టుమెంట్లలో భక్తుల తాకిడి ఎక్కువైంది.
తిరుమల(Tirumala)లోని 14 కంపార్టుమెంట్లు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతోందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. అలాగే శ్రీవారిని 65,633 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,352 మంది శ్రీవారికి తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మరోవైపు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రానికి(Srikalahasti Temple) భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి శివ నామ స్మరణతో పులకించింది. శనివారం వేకువజామున 2 గంటల నుంచే శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తజనం తరలివచ్చారు. స్వయంభువుగా వెలసిన వాయు లింగేశ్వరస్వామి నిత్యాభిషేక మూర్తిగా భక్త జనానికి శ్రీకాళహస్తీశ్వరాలయం శివయ్య దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు నంది వాహనం, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై అధిరోహించి విహరించారు. మహాశివరా(Mahashiva ratri)త్రిని పురష్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లను సుమారు లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.