»Cid Officials Are Questioned Chintakayala Vijay About 7 Hours
chintakayala vijay:7 గంటలపాటు సుధీర్ఘంగా విచారణ
chintakayala vijay:టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ (chintakayala vijay) సీఐడీ (cid) విచారణ ముగిసింది. ఏడు గంటల పాటు (7 hours) సుధీర్ఘంగా అధికారులు విచారించారు. రెండోసారి సీఐడీ విచారణకు వెళ్లానని విజయ్ మీడియాకు తెలిపారు. మొన్న 68 ప్రశ్నలు (68 questions).. ఈ రోజు 42 ప్రశ్నలు (42 questions) వేశారని పేర్కొన్నారు.
chintakayala vijay:టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ (chintakayala vijay) సీఐడీ (cid) విచారణ ముగిసింది. ఏడు గంటల పాటు (7 hours) సుధీర్ఘంగా అధికారులు విచారించారు. రెండోసారి సీఐడీ విచారణకు వెళ్లానని విజయ్ మీడియాకు తెలిపారు. మొన్న 68 ప్రశ్నలు (68 questions).. ఈ రోజు 42 ప్రశ్నలు (42 questions) వేశారని పేర్కొన్నారు. తాను అన్ని ప్రశ్నలకు సమధానాలు చెప్పానని తెలిపారు. హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరగనుందని వివరించారు. గతంలో టీడీపీ గ్రామస్థాయి నిర్మాణం వరకు వివరాలు అడిగారని.. చంద్రబాబు (chandrababu), లోకేశ్‌కు (lokesh) సంబంధించిన అంశాలు కాకుండా ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నలు అడగాలని సీఐడీకి చెప్పానని తెలిపారు.
గతేడాది సీఎం వైఎస్ జగన్ (jagan) భార్య భారతిని (bharathi) లక్ష్యంగా సోషల్ మీడియాలో (social media) ఓ పోస్ట్ చక్కర్లు కొట్టింది. దీనిని ఐ-టీడీపీ (i-tdp) బాగా సర్క్యులేట్ చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా చింతకాయల విజయ్ను గత నెల జనవరి 30వ తేదీన సీఐడీ (cid) విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తికాకపోవడంతో ఈ రోజు మరోసారి హాజరుకావాల్సిందిగా సీఐడీ అధికారులు కోరారు. దీంతో విజయ్ లాయర్‌ను వెంటబెట్టుకుని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
భారతి పే (bharati pay) అని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఐ- టీడీపీ (i-tdp) ద్వారా పోస్ట్ సర్క్యులేట్ చేశారని సీఐడీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఏడాది అక్టోబరు 1న కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో గల విజయ్ ఇంటికెళ్లి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. దీనిపై విజయ్ (vijay) హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 27వ తేదీన హాజరుకావాలని ధర్మాసనం తెలిపింది. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని చెప్పగా, 30వ తేదీన లాయర్ సమక్షంలో విచారణకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టంచేసింది.