Chandrababu: రాజమండ్రి జైలులో డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబు!
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ములాఖత్ సమయంలో కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఈ విషయాన్ని తెలిపారు. జైలులో ఉక్కపోతలు ఎక్కువగా ఉన్నట్లు జైలు మెడికల్ ఆఫీసర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajamandry Central Jail)లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. జైలులో తీవ్ర ఉక్కపోత కారణంగా ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారని తెలుస్తోంది.
ఉక్కపోతకు సంబంధించి జైలు మెడికల్ ఆఫీసర్‌కు చంద్రబాబు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు (Chandrababu) ములాఖత్ సమయంలో కుటుంబ సభ్యులకు తెలిపారు. ఏపీలో గత కొన్ని రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజమండ్రి పరిసరాల్లో కూడా గత నాలుగు రోజుల నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత (Temperature) నమోదవుతోంది. ఈ తరుణంలో అక్కడ విపరీతమైన ఉక్కపోతలున్నాయి.