»Nara Lokesh Cid Investigation Concluded 49 Questions Were Asked By The Officials
Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ సీఐడీ విచారణ… 49 ప్రశ్నలు అడిగిన అధికారులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో భాగంగా నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయనకు 49 ప్రశ్నలు వేశారు. మరికొంత సమాచారం కోసం రేపు కూడా హాజరు కావాలని లోకేశ్‌కు నోటీసులిచ్చారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు (Inner Ring Road Scam Case)లో నేడు టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ (Nara Lokesh)ను సీఐడీ (CID) అధికారులు విచారించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయానికి నారా లోకేశ్ రావడంతో ఈ విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల తర్వాత విచారణ ప్రారంభమై సాయంత్రానికి ముగిసింది. సీఐడీ విచారణలో భాగంగా నారా లోకేశ్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగి కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి అక్టోబర్ 4వ తేదీనే నారా లోకేశ్ సీఐడీ విచారణకు (CID) హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు సీఐడీ అధికారులు కూడా ఆయనకు నోటీసులు (CID Notices) పంపించారు. అయితే హైకోర్టు (HighCourt) ఆదేశాల మేరకు లోకేశ్‌ను నేడు అధికారులు విచారించారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill developement scam Case)లో భాగంగా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
సీఐడీ విచారణలో నేడు లోకేశ్‌ను అధికారులు 49 ప్రశ్నలు అడిగారు. అయితే మరింత సమాచారం కోసం రేపు కూడా మరోసారి ఆయన విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు (Amaravati Inner Ringroad scam Case)లో నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని లోకేశ్ స్పష్టం చేశారు.