»Chandrababu Brought Venigandla Ram To The Ring To Compete Against Kodali Nani In Ap Gudiwada
Chandrababu: కొడాలి నానికి చెక్ పెట్టెందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్
గుడివాడలో కొడాలి నానిని గద్దే దించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టార్ ప్లాన్ వేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపనున్నారు.
Chandrababu brought Venigandla Ram to the ring to compete against Kodali Nani in AP Gudiwada.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉన్నప్పటికీ రాజకీయాలు(Politics) మాత్రం రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైసీపీ ఎత్తులు వేస్తుంది. వాటిని చిత్తు చేయడానికి ప్రతిపక్షాలు పన్నాగాలు పన్నుతున్నాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) రాష్ట్రాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. కుమారుడు నారా లోకేశ్(Lokesh) యువగళం(Yuvagalam) పేరుతో చేస్తున్న పాదయాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. జనసేనాని(Pawan Kalyan) వారాహి యాత్రపేరుతో ఓటర్లలో హీటును పెంచుతున్నారు. చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు అభ్యర్థిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
టీడీపీ నేతగా ఎదిగి, అందులోనే గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) చంద్రబాబును, లోకేష్‌ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. ఈ సారి కొడాలి నాని కొమ్ములు వంచాలని గట్టిగానే ఫిక్స్ అయినట్లున్నారు చంద్రబాబు. గుడివాడ నుంచి 2004, 2009ల్లో టీడీపీ అభ్యర్థిగా, 2014, 2019ల్లో వైసీపీ నుంచి గెలుపొందిన నానికి అక్కడ బలమైన మద్దుతుదారులు ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడినుంచే పోటీ చేయడం ఖాయం. గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గుడివాడ మొదటి నుంచి టీడీపీ కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇక్కడ నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. గుడివాడలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.
ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇంచార్జిగా రావి వెంకటేశ్వరరావు(Ravi Venkateshwar Rao) ఉన్న సంగతి తెలిసిందే. 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయన ఇప్పటికీ పార్టీలో బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము (Venigandla Ramu) తెలుగుదేశం పార్టీ తరుఫున భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఫౌండేషన్ స్థాపించి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు. టికెట్ కోసం రావి, రాము ఇద్దరు పోటీలో ఉండగా.. ఆర్థిక బలంతోపాటు ప్రజల్లో తిరుగుతున్న వెనిగండ్ల రాముకే బాబు టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది. గుడివాడలో టీడీపీ అభ్యర్థి ఎవరో తెలియక ఆ పార్టీ శ్రేణులు కూడా అయోమయంలో ఉన్నాయని ఇప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే అందరిలో ఉత్సాహం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కొడాలి నానికి రాము గట్టి పోటీ అని పార్టీ అధిష్టానం నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.