GNTR: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ కార్యక్రమం కొల్లిపర మండలంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు జరగనున్నట్లు టీడీపీ వర్గ సభ్యులు తెలిపారు. పాల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, రైతుల ఖాతాల్లో రూ. 7000 జమ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారని వారు వెల్లడించారు.