ELR: ‘మొంథా’ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, గణపవరం మండలం పిప్పర-గణపవరం ప్రధాన రహదారి ఇరుప్రక్కల ప్రమాదభరితంగా ఉన్న చెట్లను క్రేన్ సహాయంతో తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మంగళవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యవేక్షించారు. తుఫాన్ కారణంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న చెట్లను తొలగిస్తున్నట్లు తెలిపారు.