KRNL: సీఎం నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఆదోని టీడీపీ యువనాయకులు మారుతి నాయుడు, వెంకటేష్ చౌదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం, మంత్రి లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని వారు తెలిపారు.