E.G: గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయికి చేర్చడమే ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ లక్ష్యమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఉనగట్ల ZPHSలో ఈ క్రీడా సంబరాలను ఆయన ప్రారంభించారు. క్రీడలు శారీరక దార్థ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అనంతరం పరుగు పందెం విజేతలకు బహుమతులు అందజేశారు.