PLD: నరసరావుపేట మండలం కోటప్పకొండ పరిసర ప్రాంతాలపై శుక్రవారం పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. ప్రజలు, మీడియా నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ శ్రీనివాసరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ డ్రోన్ నిఘా కొనసాగుతుందన్నారు.