SKLM: సరుబుజ్జిలి మండలం జనసేన కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలతో ఆమదాలవలస ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీలలో సమస్యల పరిస్కారం దిశగా చర్యలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలు, జనసేన సభ్యత్వ నమోదు వంటి వాటిపై చర్చించారు. సరుబుజ్జిలి మండలం జనసేన అధ్యక్షులు పైడి మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.