ASR: అనంతగిరి మండలంలో గురువారం ఓ గిరిజనుడు ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు. గుమ్మా పంచాయతీ వంజలవలసకి చెందిన దేముడు, బంధువును చిట్టంవలసకి దిగబెట్టేందుకు ఇద్దరు కలిసి వెళ్లారు. వాగును దాటించే క్రమంలో బంధువు వెళ్లిపోగా దేముడు గల్లంతై ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమవగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.