ELR: నూజివీడు ఎంపీడీవో చెన్న రాఘవేంద్రనాథ్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీర బాలాంజనేయ స్వామి అభినందిస్తూ బుధవారం లేఖ పంపారు. ఇటీవల సంభవించిన తుఫానులో ప్రజలను సంరక్షించడం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఇతర సౌకర్యాలు కల్పించి, 100% సేవలు అందించినందుకు అభినందనలు తెలిపారు.