W.G: ఉండి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12వ తేదీ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐల జిల్లా ప్రధానాధికారి శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐలలో 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు అన్నిధ్రువపత్రాలతో తీసుకొని రావాలని సూచించారు.