VZM: జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా ఇంఛార్జ్ మంత్రి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం జరిగిన స్వచ్ఛాంధ్ర-2025 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను అందజేశారు.