VZM: తెర్లం మండలం రంగప్పవలస పంచాయతీ తమ్మయ్యవలసలో ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పాములు బెడద ఉండడంతో గడ్డిమందు పిచికారి చేస్తున్నట్లు సర్పంచ్ రాంబాబు తెలిపారు. పరిసరాలను సుబ్రంగా ఉంచాలని, కాలువలలో చెత్తను వేయవద్దని ప్రజలను కోరారు.