సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ టీఎస్ చేతన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రేమ, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం మర్చిపోలేనని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి చేసిన ప్రతి పని గుర్తుండిపోతుందన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలిసి వీడ్కోలు పలికారు.