SKLM: కొత్తూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో శ్రీధర్ రాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయం రికార్డ్స్‌ను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు వీటిని అప్డేట్ చేయాలని, సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు సేవలందించేందుకు కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పారు. సర్వేలు వేగవంతమయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.