KDP: వెల్లటూరు విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మత్తుల కారణంగా నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఉపకేంద్రం ఏఈ రవికుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం వ్యవసాయ మోటార్లకు సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రాత్రి 9 గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని వివరించారు.