GNTR: తెనాలిలో సుందరయ్య నగర్‌కు చెందిన బ్లెస్సింగ్ పాల్ (9) కరెంట్ షాక్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటుండగా రోడ్డుపై తెగిపడి ఉన్న 12కేవీ హైటెన్షన్ వైర్ తగిలి షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. కరెంట్ షాక్ కారణంగా శరీరం కాలిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.