ప్రకాశం: గత ఎన్నికల్లో చంద్రబాబు మోసపు మాటలు విని రాష్ట్రప్రజలు దారుణంగా మోసపోయారని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దర్శిలోని ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడారు. ఈసారి ఎన్ని కూటములు ఎదురైనా జగనన్న సీఎం అవ్వడం ఖాయమని తెలిపారు.