MNCL: తాండూర్ మండలంలో 247 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మండలంలో తనిఖీలు చేయగా రూ.6,17,500 విలువ చేసే 247 కిలోల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయన్నారు. ఐదుగురు కొనుగోలుదారులు, ముగ్గురు డ్రైవర్లను అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు మనోహర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.