NRML: రోడ్డు ఆక్రమణలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా హెచ్చరించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.