MLG: తాడ్వాయి మండలంలోని విండ్ ఫాల్ అటవీ ప్రాంతంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం బయటపడటం స్థానికుల్లో ఆందోళన నెలకొల్పింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం మినీ జాతరకు కుటుంబంతో కలిసి వచ్చిన ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడని ఫిర్యాదు అందిందని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.